హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి స్టేషన్ రోడ్లో ఉన్న క్యాట్ టెక్నాలజీస్ భవన కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అబిడ్స్‌లో అగ్నిప్రమాదం.. పది లక్షల వరకు ఆస్తి నష్టం - తెలంగాణ వార్తలు
నాంపల్లి స్టేషన్ రోడ్లో ఉన్న క్యాట్ టెక్నాలజీస్ భవన కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
అబిడ్స్‌లో అగ్నిప్రమాదం.. పది లక్షల వరకు ఆస్తి నష్టం
కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ఈ ప్రమాదంలో పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి