మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ భావనా ఋషి కో-ఆపరేటివ్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకులోని కంప్యూటర్లు, టేబుళ్లు, ఏసీలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది... వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రామంతాపూర్లో అగ్నిప్రమాదం... కంప్యూటర్లు దగ్ధం - తెలంగాణ వార్తలు
రామంతాపూర్లోని ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్వర్టర్ బ్యాటరీ పేలి ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
రామంతాపూర్లో అగ్నిప్రమాదం... కంప్యూటర్లు దగ్ధం
బ్యాంకులోని ఇన్వర్టర్ని ఆన్ చేయడం వల్ల బ్యాటరీలు పేలి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంతో స్వల్ప నష్టం జరిగిందని బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు.