తెలంగాణ

telangana

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం..

మేడ్చల్‌ జిల్లాలోని బాపూజీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రతకు సిలిండర్‌ పేలి సుమారు 10 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

By

Published : May 29, 2020, 1:47 PM IST

Published : May 29, 2020, 1:47 PM IST

fire accident at bapuji nagar in medchal district
భారీ అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా వలస కార్మికులు నివాసం ఉంటున్న గుడిసెలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఓ గుడిసెలో ఉన్న సిలిండర్ పేలి.. అన్నింటికీ మంటలు వ్యాపించాయి.

మంటలు పెద్దఎత్తున ఎగిసి పడటం వల్ల దాదాపు 10 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు ప్రజలను ఘటనా స్థలం నుంచి బయటకు పంపిస్తున్నారు. ప్రమాద సమయంలో గుడిసెలో ఉన్నవారు అప్రమత్తమై బయటకు రావడం వల్ల ప్రాణనష్టం తప్పింది.

ఘటనా స్థలిని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సందర్శించారు. కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

భారీ అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం

ఇదీచూడండి: మద్యం మత్తులో వేలు కొరికేసిన తాగుబోతు

ABOUT THE AUTHOR

...view details