హైదరాబాద్ అబిడ్స్ గన్‌ఫౌండ్రీలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదట హోటల్ కిచెన్‌లో మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న చెప్పుల గోదాంలోకి వ్యాపించాయి.
గన్‌ఫౌండ్రీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం - హైదరాబాద్ క్రైమ్ న్యూస్
హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. హోటల్ కిచెన్‌లో చెలరేగిన మంటలు కాస్త.. పక్కనే ఉన్న చెప్పుల గోదాంలోకి వ్యాపించాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గన్‌ఫౌండ్రీ సమీపంలో అగ్నిప్రమాదం..
గన్‌ఫౌండ్రీ సమీపంలో అగ్నిప్రమాదం..
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. రెండు శకటాలతో మంటలను అదుపుచేశారు. గోదాంలో ఉన్న చెప్పులు, హోటల్ ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:మియాపూర్ రిలయన్స్ డిజిటల్లో భారీ చోరీ.. షోరూం మూసివేత