సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఫైనాన్స్‌పై జంగం సైదులు 2016లో ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. ద్విచక్రవాహనంపై ఉన్న అప్పు తీరడం వల్ల బైక్ క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రం ఇవ్వమని సైదులు యాజమాన్యాన్ని కోరాడు. కొన్నిరోజుల వరకు ఆగాలని కంపెనీ తెలిపింది.
ధ్రువీకరణ పత్రం ఇవ్వమని అడిగితే కత్తితో పొడిశారు! - latest crime news in telangana
ధ్రువీకరణ పత్రం ప్రాణం మీదకు తెచ్చింది. ద్విచక్రవాహనం ధ్రువీకరణ పత్రం ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిపై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది కత్తితో దాడి చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది.
ధ్రువీకరణ పత్రం ఇవ్వమన్నందుకు ఏం చేశారో తెలుసా?
ఈ విషయమై సైదులు, ఫైనాన్స్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కంపెనీ సిబ్బందిలో ఒకరు సైదులును కత్తితో వెనక నుంచి పొడిచాడు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడం వల్ల కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి:మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్