తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు - బుల్లితెర నటీ శ్రావణి ఆత్మహత్య కేసు తాజా వార్తలు

Filmmaker Ashok Reddy arrested in Shravan suicide case
శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు

By

Published : Sep 16, 2020, 11:24 AM IST

Updated : Sep 16, 2020, 12:56 PM IST

11:23 September 16

శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో నిందితుడు, సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పటికే దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను రిమాండ్‌కు తరలించగా...పరారీలో ఉన్న అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అవకాశాలు ఇప్పిస్తానంటూ

సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు.

ఆమెపై మరింత ఒత్తిడి

దేవరాజ్‌ వేధిస్తున్నట్టు జూన్‌ 22న శ్రావణి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మరుసటిరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దేవరాజ్‌ను అరెస్ట్‌ చేయవద్దని కోరింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పింది. విషయం తెలిసిన సాయికృష్ణ, అశోక్‌రెడ్డి ఆమెపై మరింత ఒత్తిడి పెంచారు. సాయికృష్ణ, అశోక్‌రెడ్డి ఇద్దరూ పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసగించారంటూ పలుమార్లు శ్రావణి స్నేహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఆ క్లిష్ట సమయంలో పరిచయమైన దేవరాజ్‌కు శ్రావణి చేరువైంది.

ఇదీ చూడండి :అర్థరాత్రి గుట్టుగా చొరబడిన దొంగలు.. రూ. 12 లక్షలు చోరీ

Last Updated : Sep 16, 2020, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details