కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంఘంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మైసాని సంగా గౌడ్ వర్గం వారు అక్రమంగా కల్లు దుకాణం ఏర్పాటు చేశారని సంగా గౌడ్ వర్గం ఆరోపించింది. కారంపొడి వేసి కర్రలతో మైసాని సంగా గౌడ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మైసాని సంగా గౌడ్ వారికి గాయాలయ్యాయి.
కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు
అక్రమంగా కల్లు దుకాణం ఏర్పాటు చేశారని వారిపై దాడికి దిగిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపించారు.
కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు
గాయాలపాలైన వర్గం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఇదంతా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే అని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్