వనపర్తి జిల్లాకు చెందిన సోమసుందర్ హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే ఇతనిపై వివిధ పీఎస్‌లలో 57 కేసులు నమోదయ్యాయి. ఎస్ఆర్నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌లో భాగంగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఆగస్టులో సోమసుందర్‌కు కరోనా సోకగా.. గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.
57 కేసుల్లో నిందితుడు.. బైక్ దొంగలిస్తుండగా అరెస్ట్
అతడు 57 కేసుల్లో నిందితుడు. పోలీసులు పట్టుకోని చర్లపల్లి జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. తర్వాత కరోనా సోకిందని ఆస్పత్రిలో చేర్చారు. అదే మంచి అవకాశంగా భావించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పారిపోయి బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... దొంగలించిన వాహనంతో నిందితుడు దొరికిపోయాడు.
ఇదే మంచి అవకాశం అనుకొని నిందితుడు ఆస్పత్రి సెకండ్ ఫ్లోర్ నుంచి పరారయ్యాడు. పారిపోయి ద్విచక్రవాహనాలు దొంగతనం చేయడం ప్రారంభించాడు. బాలానగర్ పరిధిలో ద్విచక్రవాహనం పోయిందన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. అదే బైక్‌పై బోయిన్పల్లి వైపు వెళ్తుండగా పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని విచారించగా.. సోమసుందర్‌పై నమోదైన కేసులు బయటపడ్డాయి. కొవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పిస్తే.. పారిపోయి చోరీలకు పాల్పడ్డాడని బాలానగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు.
ఇదీ చదవండి:ఈ దొంగపై మహరాష్ట్రలో 47 గొలుసు దొంగతనాలు