తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు - హైదరాబాద్​ తాజా వార్తలు

పని చేస్తున్న కంపెనీకే కన్నం వేశారు ముగ్గురు ఉద్యోగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి రూ.1,07,92,000 విలువైన వాహనాలు, చరవాణిలు, క్రిమిసంహారక మందులు స్వాధీనం చేసుకున్నారు.

fertilizers theft arrested by rachakonda police
పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు

By

Published : Dec 18, 2020, 6:02 PM IST

రంగారెడ్డి జిల్లా మన్నేగూడలోని జాతీయ కోరమండల్ లిమిటెడ్ క్రిమిసంహారక మందుల గోడౌన్​లో గత కొద్ది రోజులుగా మందులు చోరీకి గురవుతున్నాయి. ఈ విషయమై కంపెనీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గోడౌన్​లో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులే దొంగలుగా తేల్చారు.

నిందితులు నకిలీ తాళపు చెవిని తయారు చేయించి రెండు నెలలో వ్యవధిలో ఐదు సార్లు 98 కాటన్ల క్రిసంహారక మందు బాక్సులను దొంగిలించారు. వీరి పట్టుకున్న పోలీసులు.. రూ.1,07,92,000 విలువైన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్​ఫోన్లు, 98 కాటన్ల క్రిమిసంహాక మందులు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ తెలిపారు.

ఇదీ చదవండి:స్వల్పంగా పెరిగిన బంగారం ధర

ABOUT THE AUTHOR

...view details