హైదరాబాద్ మాదాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయాలపాలయ్యారు. జుబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వేగంగా వస్తున్న ఫెరారీ కారు అయ్యప్ప సొసైటి 100 ఫీట్ రోడ్డులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి..తర్వాత నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది.
రోడ్డుపై ఫెరారీ కారు బీభత్సం.. ఒకరు దుర్మరణం.. - జుబ్లీహిల్స్ నుంచి మాదాపూర్
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఫెరారీ కారు ఇద్దరు పాదచారులను ఢీకొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
ఇద్దరు పాదచారులను ఢీకొట్టిన ఫెరారీ కారు
దీంతో ఏసుబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలపాలైన మరొకరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నవీన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించవద్దంటూ ఏసుబాబు కుటుంబీకులు ఆందోళన చేశారు.
ఇదీ చూడండి :ట్రంప్ వీరాభిమాని ఆకస్మిక మృతి.. ఎందుకంటే..
Last Updated : Oct 11, 2020, 11:28 PM IST