ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం కైలాసపురానికి చెందిన పిరిపిల్లి కొర్లయ్య కుమార్తె కప్పరాడకు చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ఇంట్లో వారికి తెలియకుండా గురువారం వివాహం చేసుకున్నారు.
శుక్రవారం నూతన దంపతులిద్దరూ కంచరపాలెం ఠాణాకు వచ్చి... కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వయసు, వివాహ ధ్రువపత్రాలతో సాయంత్రం స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించారు. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువురి కుటుంబ సభ్యులకూ సమాచారం ఇచ్చారు. యువకుడి కుటుంబీకులు స్పందించలేదు. యువతి తరఫునవారు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.