కుమార్తెను ఎవరైనా అల్లరి చేస్తే... ధైర్యం చెప్పి.. ముందుండే వాడు తండ్రి. ఆ తండ్రే తన కన్న కూతురిపై కన్నేస్తే..సమాజం తలదించుకునే పని చేస్తే. విశాఖ జిల్లా పాడేరులో అదే జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపై రెండేళ్లుగా ఓ తండ్రి రాక్షసుడిలా ప్రవర్తించేవాడు. తన కామవాంఛతో ఓ పసి జీవితాన్ని నాశనం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ జిల్లాలోని ఓ గిరిజన గూడెంలో 14 ఏళ్ల బాలిక కేజీబీవీ వసతి గృహంలో చదువుకుంటోంది. బాలికకు తల్లిదండ్రులు, ఓ తమ్ముడు ఉన్నారు. తండ్రి తరచూ మద్యం సేవించి తల్లిని కొడుతూ హింసించేవాడు. వేధింపులు భరించలేక తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి కుమార్తెపై కన్నేశాడు తండ్రి. భయ భ్రాంతులకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా రెండేళ్లుగా కుమార్తెను చిత్రహింసలకు గురిచేసేవాడు. వసతి గృహంలో ఉన్నప్పుడు సెలవులకు ఇంటికి వచ్చినా... కూృర మృగంలా ప్రవర్తించేవాడు.