సిద్దిపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచకు చెందిన కావాటి ఎల్లయ్య సిద్దిపేటలోని శివాజీనగర్‌లో ఉంటూ పాత ఇనుప సామాను వ్యాపారం చేసేవాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు.
బండరాయితో కన్న తండ్రిని కొట్టి చంపిన కొడుకు - సిద్దిపేట జిల్లా వార్తలు
కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
బండరాయితో కన్న తండ్రిని కొట్టి చంపిన కొడుకు
ఎల్లయ్యకు రెండో భార్య కుమారుడు ప్రసాద్‌తో తరచుగా గొడవలు జరిగేవి. శుక్రవారం వారిద్దరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకున్నారు. ప్రసాద్ తండ్రి ఎల్లయ్యను బండరాయితో కొట్టి చంపేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ముందు నుంచి సైకోలాగా వ్యవవహరించే వాడని మృతుడి బంధువులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది
Last Updated : Sep 11, 2020, 4:58 PM IST