ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోయలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తన ఇద్దరు కుమారులను ఓ తండ్రి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
రంగప్ప, రాధమ్మ అనే భార్యాభర్తలకి ఏడేళ్ల సుదీప్, సుధీర్ ఉన్నారు. రాత్రి తల్లి పక్కన నిద్రించిన పిల్లల్లో ఒక్కొక్కరిని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రంగప్ప హత్య చేశాడు. మొదట సుదీప్‌ను తీసుకెళ్లి హతమార్చి గుంతలో పూడ్చి పెట్టాడు. తర్వాత సుధీర్‌ను చంపి పూడ్చి పెట్టాడు.
బిడ్డలు తన పక్కన లేకపోయేసరికి కంగారు పడిన తల్లి స్థానికుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికింది. రంగప్పపై అనుమానం వచ్చిన గ్రామస్థులు అతన్ని నిలదీశారు. చివరకు పిల్లలను హతమార్చి పూడ్చిపెట్టిన ప్రదేశానికి అందర్నీ అతను తీసుకెళ్లాడు. ఆ దుర్ఘటన చూసిన అంతా హతాశులయ్యారు.