మద్యం మత్తులో తండ్రి.. కుమారుడిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కొక్కిలిగడ్డ అశోక్‌కు అతని భార్యకు మధ్య వివాదాలు ఉండటంతో ఆమె కొంతకాలం క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో అశోక్, అతని తండ్రి దైవసహాయం ఉంటున్నారు. తండ్రీకొడుకుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించి వాగ్వాదం పెట్టుకున్నారు. మాటా మాటా పెరిగి గొడవ తీవ్రం అయ్యింది. అనంతరం అశోక్ పడుకుని ఉండగా.. అతని తండ్రి దైవసహాయం రోకలిబండతో అతని తలపై కొట్టాడు. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.