వీడు తండ్రి కాదు... రాక్షసుడు - father
మానవత్వం మంట గలిసింది. రక్త సంబంధానికి విలువ లేకుండా పోయింది. ఓ తండ్రి కన్న కూతురిని తన తల్లితో కలిసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన హైదరాబాద్ బేగంబజార్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని బేగంబజార్ ఓంనగర్‌కు చెందిన ఓ తండ్రి కన్న కూతురిని తన తల్లితో కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. శ్యామ్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ అతను... నిత్యం తాగి వచ్చి పెద్ద కూతురు మానసను కొట్టెవాడు. వద్దని వారించాల్సిన అతని తల్లి కొడుకు సహకరిస్తూ ఉండేది. ఈ మధ్య మానసపై తండ్రి శ్యామ్ చిత్రహింసలు ఎక్కువయ్యాయి. చిన్నారిని చేరదీసిన స్థానికులు చికిత్స చేయించి స్థానిక బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌తో పాటు అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.