తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కూతుళ్ల పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి బలవన్మరణం - suicide news in anantapur dst

కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేదన్న ఆవేదనతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో చోటుచేసుకుంది. ఐదుగురు కూతుళ్లు ఉన్న ఆ తండ్రి అప్పు చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు. మిగిలిన ముగ్గురి విషయంలో ఆవేదనతోనే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

father committed suicide in anatapur dst due to financial crises
కూతుళ్లకు పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి ఆత్మహత్య

By

Published : Jul 12, 2020, 6:08 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో ఆర్థిక ఇబ్బందులతో సురేంద్ర నాయక్ (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం ఐదుగురు కూతుళ్లకు తండ్రి అయిన సురేంద్ర.. అప్పులు చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు.

ఇంకా పెళ్లి కావాల్సిన ముగ్గురు కూతుళ్లు ఉండగా.. ఆర్థిక స్తోమత లేకపోవడం.. ఇంట్లో మనస్పర్థలు పెరగడం వల్ల మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇవీచూడండి:మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

ABOUT THE AUTHOR

...view details