ఏపీలోని విజయవాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ. 5 వేలకు కన్నబడ్డను అమ్మడానికి ప్రయత్నించాడో తండ్రి. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సతీశ్ మద్యానికి బానిసయ్యాడు. సమరాంగ్ చౌక్ సమీపంలోని ఓ బార్ వద్ద బాలికను అమ్మటానికి ప్రయత్నంచగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి - అమ్మకానికి ఆడపిల్ల
తాగుడుకు బానిసైన ఓ తండ్రి రూ. 5 వేలకు కన్నకూతురుని అమ్మకానికి పెట్టాడు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని విజయవాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్పందించిన పోలీసులు పాపను చైల్డ్‌లైన్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశారు.
కన్నకూతురుని అమ్మకానికి పెట్టిన తండ్రి
పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పాపను.. సతీశ్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం చిన్నారిని చైల్డ్‌లైన్ అధికారులకు అప్పగించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:ముగిసిన గ్రేటర్ పోలింగ్.. ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్