ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముటున్న ఓ వ్యక్తి.. తన కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు అతని భార్య స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. ఆమె గర్భవతిగా తేలింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
దారుణం.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం! - విశాఖ క్రైం న్యూస్
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి.. దారుణానికి ఒడిగట్టాడు. కొండంత భరోసా ఇస్తాడనుకున్న ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి ముసుగులో తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. మానవ సంబంధాలను మంటగొలిపిన ఈ ఘటన ఏపీ విశాఖపట్నం జిల్లా మల్కాపురం ఠాణా పరిథిలో జరిగింది.
దారుణం.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!