వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన తండ్రి కాడారి సదానందం, కుమారుడు కమల్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న కూతురుకు తీవ్ర గాయాలు కాగా, భార్య స్వర్ణకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు.
బంధువుల రోదనలు
ఓ శుభకార్యాం నిమిత్తం దామెర నుంచి కాజీపేటకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తండ్రి, కొడుకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. తండ్రి, కొడుకులు ఒకేసారి మృతి చెందిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:దొంగతనానికి వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి