నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తమ పొలంలోని పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ కంచెకు తగిలి తండ్రీకొడుకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
విషాదం: విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి - నిర్మల్ జిల్లాలో విద్యుదాఘాతంతో తండ్రీ కొడుకులు మృతి
పొలంలోని పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ తీగలే ఆ తండ్రీకొడుకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విషాదం: విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి
గ్రామానికి చెందిన కర్జాలా రాములు ,మురళి అనే తండ్రీకొడుకులు మంగళవారం తమ పొలంలో సోయా పంటను కోశారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పంట తడవకుండా ఉండేందుకు టార్పలిన్ కప్పడానికి వెళ్లిన వారికి పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు.
ఇదీ చదవండి: 'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం'