తిరుమల నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. నడం వల్ల కారులో ఉన్న తండ్రీకొడుకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తిరుమల నుంచి తిరిగి వెళ్తుండగా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం తండ్రీకొడుకును బలితీసుకుంది. తిమ్మాపూర్ వద్ద ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొని... ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ నగర్‌కు చెందిన సత్యనారాయణ చక్రవర్తి, ఆయన కుమారుడు కల్యాణ చక్రవర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా... ఆస్పత్రికి తరలించారు. తిరుమల దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
- ఇదీ చూడండి :సహనం కోల్పోయిన అత్త.. కిరాతంగా అల్లుడి హత్య