మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో రైతు దాడి నర్సింలు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. నర్సింలుకు నలభై గొర్రెలు ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు 22 గొర్రెలు మరణించగా ఆర్థికంగా బాగా నష్టపోయాడు.
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య - venkatapur farmer suicide
ఆర్థిక ఇబ్బందులతో రైతు నర్సింలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య
గొర్రెల మృతితో మనస్తాపానికి గురైన నర్సింలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రికి తరలించారు.