ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చందర్లపాడులో రైతు కట్టా లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. పెరిగిన అప్పుల భారానికి తోడు.. ఈ ఏడాది పంటలు సరిగా పండని కారణంగా.. మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి పొలానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
అప్పుల బాధతో... అన్నదాత ఆత్మహత్య - కృష్ణా జిల్లాలో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి పొలానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
అప్పుల బాధతో... అన్నదాత ఆత్మహత్య
రైతు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా... కాలిపోయిన స్థితిలో అతని మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంతో పాటు ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని... దర్యాప్తు చేస్తున్నారు.