ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు - ap news
వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది.
![ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు farmer-injured-in-bear-attack-in-brahmasamudram-zone-of-anantapur-district in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9949195-924-9949195-1608484273605.jpg)
ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు
ఏపీలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాధాస్వామి తన పొలంలో పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు కల్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.