సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. నెల వ్యవధిలోనే ఇద్దరు రైతులు చనిపోవడం వల్ల గ్రామస్థులు ఆవేదనకు గురయ్యారు. గ్రామానికి చెందిన వేము శ్రీనివాస్ రెడ్డి రోజువారి కార్యాచరణలో భాగంగా తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి నీరు పెట్టడానికి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుగాఘాతానికి గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - రైతు మృతి
విద్యాదాఘాతంతో రైతు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: మద్దిరాలలో ఘర్షణ.. ఒకరికి గాయాలు