విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. వికారాబాద్ జిల్లా మైలార్ దేవరంపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ విషయమై సంబంధిత శాఖ లైన్మేన్కు గ్రామానికి చెందిన కుశరెడ్డి సమస్యను వివరించాడు. తాను కరెంట్ నిలిపేస్తానని... స్తంభం ఎక్కి రిపేర్ చేసుకోవచ్చని కుశరెడ్డికి లైన్మెన్ చెప్పాడు.
విద్యుదాఘాతంతో రైతు మృతి... బంధువుల ఆందోళన - farmer died
వికారాబాద్ జిల్లా మైలార్ దేవరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభం ఎక్కి రిపేర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ రావటం వల్ల రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడంటూ గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
దీంతో మరమ్మతు చేయడం కోసం స్తంభం ఎక్కి కుశరెడ్డి రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా కావంటంతో కరెంట్షాక్తో కుశరెడ్డి స్తంభంపైనే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కుశరెడ్డి చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరిగిందనే విషయం స్పష్టంగా కనబడుతుందని... మృతుడి కుటుంబాన్ని విద్యుత్ శాఖనే ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.