సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారంలో విషాదం నెలకొంది. కొత్త శంకర్(45) అనే రైతు తన పంట పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్త తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు.
పంట పొలంలో విద్యుత్ తీగ తగిలి రైతు మృతి - farmer died with current shock in dubbak mandal
పొలం పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారంలో చోటుచేసుకుంది. మరణవార్త విని రైతు కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
![పంట పొలంలో విద్యుత్ తీగ తగిలి రైతు మృతి పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8233557-1103-8233557-1596112686218.jpg)
పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి
ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.