వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మోటరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి బలయ్యాడు. నిమ్మనాయక్ అనే రైతు.. నీరుపెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో మోటారుకు విద్యుత్ ప్రసరించడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
నారాయణపురంలో విషాదం.. కరెంట్ షాక్తో రైతు మృతి - నారాయణపురం వార్తలు
నీరుపెట్టేందుకు పొలానికి వెళ్లిన రైతు.. విద్యుత్దాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన పర్వతగిరి మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
నారాయణపురంలో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి
చుట్టుపక్కల రైతులు గుర్తించి ఘటన స్థలానికి చేరుకునేలోపే నిమ్మనాయక్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి: ఫోన్ చూడొద్దని మందలిస్తే.. ప్రాణం తీసుకున్నాడు