కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నిట్టు శంకర్ అనే రైతు లింగాపూర్ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద కేబుల్ వైర్ తెగిపడి ఉండటం చూసి జాయింట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - farmer died of electric shock in lingapur
వ్యవసాయ క్షేత్రంలో తెగిపోయిన కేబుల్ వైర్ జాయింట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా లింగాపూర్ శివారులో చోటుచేసుకుంది.
కామారెడ్డిలో విద్యుదాఘాతంతో రైతు మృతి
విషయం తెలుసుకున్న కుటుంబీకులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి భార్య, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.