పొలం వద్ద విద్యుత్ వైరుకు మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు రైతు మృతి చెందిన ఘటన... మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తొగిటలో చేటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి నాగరాజు(47) అనే రైతు బోరు మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడం వల్ల మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదం జరిగినట్టు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో పొలంలో రైతు దుర్మరణం - విద్యుత్ షాక్తో పొలంలోనే రైతు మృతి
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తొగిటలో విషాదం చోటుచేసుకుంది. పొలం వద్ద బోరు మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడం వల్ల... మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్తో తలారి నాగరాజు అనే రైతు అక్కడిక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో పొలంలో రైతు దుర్మరణం
విషయాన్ని గమనించిన చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు చూసి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
ఇదీ చూడండి:మార్బుల్ మీద పడి ఏడేళ్ల చిన్నారి మృతి