లారీ వెనుక నిద్రిస్తున్న ఓ రైతు ప్రమాదానికి గురై మృత్యు వాత పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వెములనర్వ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొడుగలు గ్రామానికి చెందిన రైతు పిప్పల్ల బాలయ్య (55) వెములనర్వ శివారులో గల సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి వచ్చాడు.
పత్తి అమ్మకానికి వచ్చిన రైతు మృతి.. నిద్రిస్తుండగా విషాదం - రైతు మృత్యువాత వార్తలు వేములనర్వ
రంగారెడ్డి జిల్లా వేములనర్వలో విషాదం చోటుచేసుకుంది. పత్తి అమ్మకం అయింది కదా అని.. కొద్దిసేపు తలవాల్చాడు ఆ రైతు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు పలకరించింది. నిద్రిస్తున్న రైతును గమనించకుండా వెనక్కితీశాడు లారీ డ్రైవర్. లారీ టైర్ ఆ అన్నదాతపై వెళ్లడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు.
పత్తి అమ్మకానికి వచ్చిన రైతు మృతి.. నిద్రిస్తుండగా దారుణం
పత్తి అమ్మకానికి పంపి చెట్టు నీడన నిద్రిస్తున్నాడు. అతను నిద్రిస్తున్న ప్రాంతానికి కొద్ది దూరంలో నిలిచి ఉన్న లారీ డ్రైవర్ బాలయ్యను గమనించకుండ వాహనాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో లారీ టైరు బాలయ్య మీదకు ఎక్కింది. బాలయ్య అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:గోదవరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు