పొలం వద్ద విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి శివారు ఏఆర్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన వెంకన్న(35) అనే రైతు పొలం వద్దకు వెళ్లి పొలం పని చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - electric shock
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఏఆర్ తండాలో జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
వెంకన్న కింద పడి ఉండటాన్ని గమనించిన పక్క రైతులు గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవీ చూడండి:కొమురవెల్లి సమీపంలో మహిళ ఆత్మహత్య