తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో రైతు మృతి - నాగర్ కర్నూల్ జిల్లా నేర వార్తలు

నాగర్​ కర్నూల్ జిల్లా మైలారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీళ్లు పెడుతుండగా... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందారు. పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

farmer dead with electric shock in nagarkurnool district
విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Dec 5, 2020, 12:17 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం మైలారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నరసింహ అనే రైతు మృతి చెందారు. పొలం వద్ద ట్రాన్స్ ఫార్మర్ దగ్గర ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. పొలానికి నీళ్లు పెడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో... తీగకు మరమ్మతు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

తమ పెద్దదిక్కుని కోల్పోయామని రైతు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:మిర్యాలగూడలో అనిశాకి చిక్కిన సైట్ ఇంజినీర్

ABOUT THE AUTHOR

...view details