సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు తన పంట పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కరెంటు స్టార్టర్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపుతున్నారు. రైతు మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
విద్యుదాఘాతంతో పొలంలోనే రైతు మృతి.. - సిద్దిపేట జిల్లా నేర వార్తలు
పంట పొలం వద్ద కరెంట్ స్టార్టర్లో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో రైతు మృతి..
తెరాస మండల అధ్యక్షుడు రనం శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చే బీమా పథకం అందేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దౌల్తాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్