తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైబర్​ నేరగాళ్ల బెదిరింపులు... యువరైతు ఆత్మహత్య - జగిత్యాలలో బెదిరింపు ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు

ఆన్​లైన్​లో రుణం తీసుకుని చెల్లించట్లేదంటూ సైబర్​ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడగా ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో జరిగింది. మూడురోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన రామ్మోహన్.. శనివారం మరణించారు.

cyber criminals threatening calls at Jagityal
సైబర్​ నేరగాళ్ల బెదిరింపు ఫోన్లకు భయపడి యువరైతు ఆత్మహత్య

By

Published : Oct 10, 2020, 11:05 AM IST

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​కు చెందిన యువరైతు.. రామ్మోహన్​ రెడ్డికి గత వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. తాను తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ బెదిరించసాగారు. తాను రుణం తీసుకోలేదని చెప్పినా.. ఫోన్లు ఆగకపోవడం వల్ల రామ్మోహన్​ నంబర్​ మార్చారు.

అప్పటి నుంచి రామ్మోహన్​ కుటుంబీకులకు ఫోన్లు రాగా.. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేర్చగా.. చికిత్స పొందుతూ రామ్మోహన్ శనివారం మరణించారు. ఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిఃవైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!

ABOUT THE AUTHOR

...view details