తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సీఐ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - నిజామాబాద్​ జిల్లా నేర వార్తలు

కబ్జాదారులు ఆక్రమించుకున్న తన భూమిని అప్పగించాలంటూ ఓ రైతు పోలీస్​ స్టేషన్ చుట్టూ తిరిగాడు. ఎంతకీ పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల విసుగు చెంది ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Farmer commits suicide in front of CI office
సీఐ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 13, 2020, 8:08 AM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం వెంగల్​పాడు గ్రామానికి చెందిన తౌర్య నాయక్​కు ధర్పల్లి మండలం హోన్నజీపేట్ రెవెన్యూ శివారులో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కబ్జా చేశాడు. ఈ విషయమై కోర్టు ద్వారా హక్కులు పొందిన తౌర్య నాయక్.. తనకు భూమి అప్పగించాలని పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాడు.

ఫిర్యాదు విషయం తెలుసుకోవడానికి శనివారం ధర్పల్లి పీఎస్​కు వెళ్లాడు. ఎస్సై అందుబాటులో లేకపోవడం వల్ల సీఐ కార్యాలయానికి వెళ్లి.. పురుగుల మందు తాగేందుకు యత్నించగా.. సిబ్బంది అడ్డుకొని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి.. తుకారం గేట్​లో వ్యక్తి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details