అకాల వర్షంతో పంట నష్టం.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం.. మరోవైపు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం, పెళ్లి కావాల్సిన కూతురు ఉండటం.. ఇన్ని సమస్యలతో సతమతమైన ఓ రైతు... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిని గమనించిన బంధుమిత్రులు అతనిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 26న రాత్రి కన్నుమూశారు.
సమస్యలతో సతమతం.. తీవ్రమనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ రైతు అకాల వర్షంతో పంట నష్టం.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమస్యలతో సతమతం.. తీవ్రమనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య
మృతుడు శ్రీనివాస్ (55)కు 3 ఎకరాల పొలం ఉంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెను బంధువులకు దత్తత ఇచ్చాడు. ఇద్దరు అమ్మాయిల వివాహానికి 5 లక్షల వరకు అప్పు చేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతినడంతో అప్పు తీరే మార్గం కనిపించకపోవడం.... మరో కుమార్తె వివాహం చేయలేమనే నిర్ణయానికి వచ్చి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.