సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కల్హేర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల గుమ్మడి బాలయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న ఒక ఎకరం పొలంలో సోయా పంటను ఈ ఏడాది సాగు చేస్తున్నాడు. దీంతో పాటు ఇతరుల భూమిని తీసుకొని కౌలుకు చేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటం వల్ల సుమారు ఐదు లక్షల వరకు అప్పు అయినట్టు సమాచారం. ఈ ఏడాది అయినా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో దిగుబడి అధికంగా పొందవచ్చని ఆశతో ఎదురు చూశాడు.
పంట మునిగింది.. ప్రాణం పోయింది.. - Farmer Suicide Details in Sangareddy District
అతివృష్టితో పంట నీట మునిగి పూర్తిగా దెబ్బతినడం వల్ల తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి పొలంలోనే మరణించిన ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
![పంట మునిగింది.. ప్రాణం పోయింది.. Farmer commits suicide at Kalher village of Sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9228085-96-9228085-1603082506292.jpg)
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎకరం వ్యవసాయ భూమిలో ఉన్న సోయా పంట పూర్తిగా దెబ్బతిన్నది. పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో పాటు చేసిన అప్పులు ఎలా తీర్చాలి అనే బెంగతో ఆదివారం తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారుడు రాకేష్, కూతురు మీనాక్షి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు అందించి ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు.