జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నపూర్కు చెందిన ఆకారపు కుమార స్వామి గత కొంత కాలంగా భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పత్తి చేను పెరగలేదు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య - farmer suicide latest news
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నపూర్లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పంట దెబ్బతినటంతోపాటు అప్పుల బాధతో మనస్తాపం చెందిన కుమార స్వామి పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు