కామారెడ్డి మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగిపై దాడి - మహిళ ఉద్యోగిణిపై మాజీ సహోద్యోగి దాడి
11:52 September 21
కామారెడ్డి మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగిపై దాడి
కామారెడ్డి మున్సిపాలిటిలో పన్ను వసూలు అధికారిణి రోజాపై... మాజీ సహోద్యోగి దాడి చేశాడు. నిందితుడు రామకృష్ణ గతంలో కామారెడ్డి పురపాలక సంఘంలోనే పనిచేశాడు. మూడు నెలల క్రితం బదిలీపై వెళ్లిన రామకృష్ణ... ప్రస్తుతం బోధన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటి నుంచి రోజా మాట్లాడకపోవడం, ఫోన్ చేసినా... స్పందించలేదన్న ఆగ్రహంతో కార్యాలయంలో ఆమె గది తలుపులు మూసి చితకబాదాడు.
ప్రాణభయంతో బయటకి పరుగులు తీసిన బాధితురాలిని... ఆసుపత్రికి తీసుకెళ్లి సిబ్బంది ప్రథమ చికిత్స చేయించారు. ఎన్ని రోజులైనా తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది.