మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలో ఈ ఘటన జరిగింది. భీంజీగూడ పంచాయతీ తాటిమాదర గ్రామానికి చెందిన రైతు ఆత్రం లచ్చుకు పుర్కగూడ సమీపంలో ఆరెకరాల పొలం ఉంది. ఆదివారం రాత్రి కాపలా కోసం పొలం వద్దకు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం వరకూ ఇంటికి రాలేదు. పొలం వద్దనే రక్తపుమడుగులో మృతిచెంది ఉండగా స్థానిక రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మంత్రాల నెపంతో రైతు దారుణహత్య.. - kumuram bheem district news
కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం తాటిమాదర చెందిన రైతు ఆత్రం లచ్చును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. మంత్రాల నెపంతోనే ఘటన జరిగినట్లు సమాచారం.
మంత్రాల నెపంతో రైతు దారుణహత్య..
అదే గ్రామానికి చెందిన ఆత్రం అర్జు ఇరవై రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. లచ్చు కుటుంబం మంత్రాలు వేయడం వల్లనే ఆయన మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇరు కుటుంబాలు ఇటీవల గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అర్జు బంధువులే తన భర్తను హత్య చేశారని లచ్చు భార్య మైనుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇవీచూడండి:చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య