ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని దిశ పోలీస్ట్ స్టేషన్ వద్దే ఓ సీఐ తనపై దాడి చేశడని ఓ మహిళ ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. తెనాలిలోని చెంచుపేటకు చెందిన ఒక మహిళ భర్త ఉస్మాన్... కౌంటర్ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అధికారులు కేసు నమోదు చేయకుండా సదరు కానిస్టేబుల్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి పురోగతి లేకపోవటం, కానిస్టేబుల్ సోదరుడితో పాటు మరికొందరు బంధువులు పోలీసుశాఖలో పనిచేస్తున్నందున తమకు న్యాయం జరగదని మహిళ కుటుంబసభ్యులు భావించారు.
దిశ పోలీస్ స్టేషన్లోనే మహిళపై సీఐ దాడి.. ఏపీలో ఘటన - గుంటూరు దిశ పోలీస్ స్టేషన్
మహిళలకు భద్రత కల్పించే దిశ పోలీస్ స్టేషన్లోనే ఓ మహిళపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లాలోని దిశ పోలీస్ట్ స్టేషన్ జరిగింది. షాజిదా అనే మహిళ.. తన సోదరి కేసు గురించి స్టేషన్కు వెళ్తే తనపై సీఐ ఉస్మాన్ దాడి చేశాడని ఆరోపించింది. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
![దిశ పోలీస్ స్టేషన్లోనే మహిళపై సీఐ దాడి.. ఏపీలో ఘటన దిశ పోలీస్ స్టేషన్లోనే మహిళపై సీఐ దాడి.. ఏపీలో ఘటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8337645-903-8337645-1596844593525.jpg)
కేసు పురోగతి తెలుసుకునేందుకు బాధితురాలి కుటుంబసభ్యులు గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అదే సమయంలో సదరు కానిస్టేబుల్ తో పాటు అతని సోదరుడైన సీఐ ఉస్మాన్, మరికొందరు బంధువులు కూడా స్టేషన్ బయట కనిపించారు. వారంతా పోలీసు శాఖలో పనిచేస్తున్నవారే. అంతా కలిసి కేసుని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారనే అనుమానంతో మహిళ సోదరి షాజిదా వారి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడం వల్ల అగ్రహించిన సీఐ ఉస్మాన్, ఇతర బంధువులు షాజిదాపై దాడి చేశారు. ఒక్కసారిగా షాక్కు గురైన షాజిదా, కుటుంబ సభ్యులు సదరు సీఐపైనా దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సోదరికి న్యాయం చేయటంతో పాటు తనపై దాడికి పాల్పడ్డ సీఐ ఉస్మాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిఃఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్!