కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు జరుగుతున్నాయని దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తనపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిని పట్టుకుని చట్టరీత్యా శిక్షించాలని కలెక్టర్ కోరారు.
కలెక్టర్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం
సోషల్ మీడియాలో దుండగులు రెచ్చిపోతున్నారు. అసత్య ప్రకటనలను ప్రచారం చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు. వాటిని గమనించిన కలెక్టర్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం
జిల్లా కలెక్టర్‌పై అసత్య ప్రచారాలు చేయడం చట్టరీత్యా నేరమని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను ఇతరులకు పంపవద్దని ఆయన సూచించారు.
ఇదీ చూడండి :ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ హెచ్ఆర్సీలో కాంగ్రెస్ ఫిర్యాదు