తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మన వార్తలు.. మన ఇష్టం అనుకుంటే చర్యలు తప్పవు - Hyderabad Crime News

సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం అందిస్తున్నారు కొంతమంది. సైబర్‌ నేరస్థుల కొత్త తరహా ప్రచారమని పోలీసులు గుర్తించారు. ఇలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

False news is being spread on social media
మన వార్తలు.. మన ఇష్టం!

By

Published : Nov 4, 2020, 6:04 PM IST

‘‘హైదరాబాద్‌లో భారీ వర్షాలకు వరద నీటిలో కొట్టుకుపోయిన 15 మంది వ్యక్తులు.. వారి జాడ కోసం గాలిస్తున్న పోలీసులు’’

‘‘దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 26 కూడా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం’’

‘‘దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి తెరాసలో చేరుతున్నారు.. ఇందుకు నిర్ణయం జరిగిపోయింది’’

సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌... వాట్సాప్‌లలో వైరల్‌ అయిన వార్తలివి..

వాస్తవానికి ఇవన్నీ సత్యదూరమైన వార్తలు. ఈ వీడియోలన్నింటినీ నిమిషాల్లోనే వేలమంది చూశారు. కొందరు సైబర్‌ నేరస్థులు కావాలనే ఇలా అసత్యాలను వార్తలుగా చేసి సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. ఇటీవల ఈ ధోరణి పెరిగిందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

మూడు పోలీసు కమిషనరేట్లలో ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా అసత్యవార్తలు, తప్పుడు కథనాలు పంపుతున్నారు. పాత చిత్రాలు, దృశ్యాలు, విదేశీ వీడియోలను తీసి వాటికి వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగే వార్తలు, కథనాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details