తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అమాయకులను మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్టు - అమఅమాయకులను మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్టు

నిరుద్యోగ యువతే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 4 పాస్ పోర్టులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం కాలాపత్తర్ పోలీసులకు అప్పగించారు.

అమాయకులను మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్టు
అమాయకులను మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్టు

By

Published : Aug 12, 2020, 9:00 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో అమాయక యువకులను గల్ఫ్ దేశాలకు పంపిస్తానంటూ, నకిలీ పత్రాలు, వీసా సృష్టించి భారీగా డబ్బు దోచుకుని జల్సా జీవితం గడుపుతున్న వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలీసులు అరెస్టు చేశారు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన సికందర్ ఖాన్ పలుమార్లు నకిలీ వీసా, ఇతర పత్రాలు సృష్టిస్తూ... ఇదివరకే జైలుకి వెళ్లి వచ్చిన బుద్దిమార్చుకోలేదు.

జల్సాలకు అలవాటు పడ్డ సికందర్... అమాయక నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బు గుంజుతున్నాడు. సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలీసులు... సికందర్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు. 4 పాస్ పోర్టులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం కాలాపత్తర్ పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details