పోలీసు శాఖలో పెద్ద అధికారి దగ్గర పని చేస్తున్నానని.. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులను మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడకు చెందిన చంద్రశేఖర్ తాను పోలీస్ కానిస్టేబుల్‌గా పలువురు అమర్నాథ్, హర్షవర్ధన్ అనే యువకులకు పరిచయం చేసుకున్నాడు. తన స్నేహితులైన భరత్, బాలరాజులు కూడా డిపార్ట్మెంట్లోనే పని చేస్తారని.. వారితో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమర్నాథ్ దగ్గర రూ.5.50 లక్షలు, హర్షవర్ధన్ దగ్గర రూ.3.50 లక్షలు వసూలు చేశారు. ఉద్యోగం ఇప్పించే పూచీ నాది అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు.
నకిలీ పోలీసు మోసం.. రూ.9 లక్షలు వసూలు
పోలీసు శాఖలో పని చేస్తున్నానని చెప్పి.. నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని షాద్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు.. ముగ్గురు మోసగాళ్లు కలిసి.. చేస్తున్న మోసాలు వెలుగు చూశాయి.
నకిలీ పోలీసు మోసం.. రూ.9 లక్షలు వసూలు
నెలలు గడిచాయి.. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం పట్ల అనుమానించిన బాధితులు షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని.. ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సీఐ శ్రీధర్ కుమార్ హెచ్చరించారు.