ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోలీసులు నకిలీ మావోయిస్టుల ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.20 లక్షల నగదు, రెండు టాయ్ పిస్తల్లు, నాలుగు కార్లు, ఐదు చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ మావోయిస్టుల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లాలో నకిలీ మావోయిస్టుల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, పలు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ మావోయిస్టుల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్
ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ వెంకటేశ్ సత్తుపల్లి పోలీస్ బృందాన్ని అభినందించారు. వారికి రివార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీచూడండి: తల్లీ, కూతురుకి మత్తుమందు ఇచ్చిన యజమాని.. ఆపై అత్యాచారం..!
TAGGED:
ఖమ్మం జిల్లా తాజా వార్తలు