నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా కలకలం సృష్టించింది. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారంటూ అత్యవసరంగా డబ్బులు కావాలని పలువురికి సైబర్ నేరస్థులు సందేశాలు పంపించారు. దీనిపై అప్రమత్తమైన కలెక్టర్.. తన అసలు ఫేస్బుక్ ఖాతా ద్వారా స్పష్టతనిచ్చారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. అనంతరం సైబర్ దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ కలెక్టర్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా.. - ఫేస్బుక్ సైబర్ నేరాలు
తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా పట్ల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్.. ప్రజలకు సూచించారు.
నకిలీ ఫేస్బుక్ ఖాతా పట్ల కలెక్టర్ అప్రమత్తం!