తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బీ అలర్ట్: స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతా - fake facebook account in the name of swathi lakra

సైబర్​ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. పెరుగుతోన్న సాంకేతికతను వినియోగించుకుంటూ రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్​ కేటుగాళ్లు. తాజాగా మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతాను తెరిచి.. పలువురికి ఫ్రెండ్​ రిక్వెస్ట్​లను పంపించారు.

Fake Facebook account in the name of Additional DG  Swathi Lakra
స్వాతి లక్రా పేరుతో నకిలీ పేస్​బుక్​ ఖాతా తెరిచిన సైబర్​ కేటుగాళ్లు

By

Published : Sep 21, 2020, 10:26 PM IST

మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్​బుక్ ఖాతా తెరిచారు. ఆ ఖాతా నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్​లు పంపించారు. దాదాపు 50 మంది ఆ రిక్వెస్ట్​ను అంగీకరించారు. ఈ ఫేస్​బుక్​ ఖాతా విషయాన్ని కొంతమంది స్వాతి లక్రా దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె నకిలీ ఖాతాగా తేల్చారు.

తన అసలు ఫేస్​బుక్​ ఖాతా నుంచి సందేశం పంపారు. తన పేరుతో పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్, సందేశాలను అంగీకరించొద్దని సూచించారు. నకిలీ ఫేస్​బుక్ ఖాతా నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్​లను వెంటనే తొలగించాలని కోరారు.

మరోవైపు స్వాతి లక్రా తన ఫేస్​బుక్ ఖాతాలో స్పందించిన వెంటనే.. సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్​బుక్ ఖాతాను తొలగించారు. ఈ నకిలీ ఖాతాపై స్వాతి లక్రా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీచూడండి.. కలెక్టర్​పై సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details